తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్: సీఎం పర్యటన నేపథ్యంలో ఎస్పీ కీలక లేఖ

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది..

తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్: సీఎం పర్యటన నేపథ్యంలో ఎస్పీ కీలక లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రి(Tadipatri)లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) ఈ నెల 9న తాడిపత్రిలో పర్యటించనున్నారు. మున్సిపల్ చైర్మన్ జేసీ దివాకర్ రెడ్డి(Municipal Chairman JC Diwakar Reddy), మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి(Former MLA Pedda Reddy) మధ్య వార్ సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెద్దారెడ్డిని ఇంటికే పరిమితం చేశారు. అడపాదడపా తాడిపత్రికి వచ్చేందుకు ప్రయత్నించడంతో ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పంపించేశారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో ఆయన తాడిపత్రి వస్తానని ప్రకటించారు. దీంతో తాడిపత్రిలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే టీడీపీ(Tdp), వైసీపీ(Ycp) నేతలు, కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

మరోవైపు సీఎం చంద్రబాబు పర్యటన మరింత ఆందోళన కలిగిస్తోంది. శాంతి భద్రతలపై పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా తాడిపత్రిలో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తాడిపత్రి పోలీసులు బలగాలు భారీగ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ లేఖ(Anantapur District SP Jagadish) రాశారు. సీఎం పర్యటన దృష్ట్యా భద్రత కల్పించలేమని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు తాడిపత్రిలో పెద్దారెడ్డి అడుగుపెడితే అడ్డుకుంటామని జేసీ వర్గీయుల హెచ్చరించారు. కచ్చితంగా వస్తామంటూ వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. దీంతో తాడిపత్రిలో టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే రెండు పార్టీల కార్యకర్తలను రోడ్లపైకి రానివ్వడం లేదు. 9వ తేదీ కూడా అనుమతులు ఉన్న వాళ్లకే సీఎం చంద్రబాబు పర్యటన వద్దకు అనుమతించనున్నారు.

Next Story