సత్తెనపల్లిలో వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం.. వాహనదారుల తీవ్ర ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

సత్తెనపల్లిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది...

సత్తెనపల్లిలో వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం.. వాహనదారుల  తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: సత్తెనపల్లి(Sattenapalli)లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ(Ycp) శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించారు. సత్తెనపల్లి బస్టాండు వద్ద జై జగన్(Jagan) అంటూ ప్రజలకు వైసీపీ జెండాలు చూపిస్తూ నినాదాలు చేశారు. భారీగా బైక్ హారన్ శబ్ధం చెస్తూ అలజడి సృష్టించారు. ప్రధాన రహదారులపై వాహనాదారులకు సైడ్ ఇవ్వకుండా బైక్‌లపై నిలబడి హడావుడి చేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ఎండ, మరోవైపు వైసీపీ కార్యకర్తల అరుపులతో విస్తుపోయారు. జగన్ తో పాటు కొంతమందికే అనుమతించినా.. భారీగా వైసీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోయినా అత్యుత్సాహం పోలేదని విమర్శలు చేశారు.

Next Story