ఎంపీ పుట్టా మహేశ్‌ యాదవ్ డ్రగ్స్ వ్యవహారం.. టీడీపీ సంచలన నిర్ణయం

by Vemula.Srinu Prasad |

ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌‌కు తెలుగుదేశం పార్టీ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఆయన నిందితుడిగా ఉన్న నేపథ్యంలో సీరియస్ అయింది...

ఎంపీ పుట్టా మహేశ్‌ యాదవ్ డ్రగ్స్ వ్యవహారం.. టీడీపీ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌(Eluru MP Putta Mahesh Yadav) కు తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసు(Moinabad drugs case)లో ఆయన నిందితుడిగా ఉన్న నేపథ్యంలో సీరియస్ అయింది. రాజకీయంగా విమర్శలు చెలరేగడంతో ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ కల్చర్‌పై ఉక్కుపాదం మోపుతున్న సమయంలో పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించింది.ఈ మేరకు పుట్టా మహేశ్‌కు ఇంటిమేషన్ ఇచ్చింది. నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని నిర్ణయించింది. చట్టపరంగా మరింత స్పష్టత వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా సరే డ్రగ్స్ విషయంలో ఉపేక్షించమని ఆయన తెలిపినట్లు సమాచారం.

Next Story