విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి.. పోలీసులు అదుపులో తల్లి, అమ్మమ్మ

by Vemula.Srinu Prasad |

విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేగింది....

విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి.. పోలీసులు అదుపులో తల్లి, అమ్మమ్మ
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(visha)లో బాలిక(girl) అనుమానాస్పద మృతి కలకలం రేగింది.గాలి సోకిందని బాలికను జ్ఞానపురం చర్చి(Gnanapuram Church)కి తల్లి, అమ్మమ్మ తీసుకెళ్లారు. అయితే బాలిక చంద్రిక చర్చిలో అనుమానస్పద స్థితిలో చనిపోయింది. బాలిక మొహానికి చున్నీ చుట్టి, నోట్లో గుడ్లు కుక్కిన ఆనవాళ్లు ఉన్నాయి. అయితే తనకు తెలియకుండానే బాలికను చర్చికి తీసుకెళ్లారని తండ్రి అంటున్నారు. విశాఖ ఐదో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాలిక తల్లి, అమ్మమ్మను అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతిపై విచారణ చేపట్టారు.

Next Story