Breaking: ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. సాధారణానికి మించి నమోదు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-29 11:05:30  IST  )

ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి...

Breaking: ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. సాధారణానికి మించి నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. నాలుగైదు రోజులుగా ఎండల తీవ్రతలు మరింత పెరిగాయి. ఉదయం నుంచే భానుడు భగ్గుమంటున్నారు. మధ్యాహ్నం నిప్పులు కొలిమిని తలపిస్తున్నారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం భయపడిపోతున్నారు. మార్చి నెలాఖరుకే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెల మాటేంటని ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సగటున 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరాయి. ప్రతి రోజూ సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా నమోదు అయ్యాయి. హీట్ వేవ్స్ కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల వడగాల్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలకు అధికారులు అప్రమత్తత ప్రకటించారు. మధ్యాహ్నం సమయంలో అత్యవసరమేతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 5 తర్వాత బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.

Next Story