- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలువలో దిగి రీల్స్.. ఒక్కసారిగా మునిగిపోయిన విద్యార్థి..!
కాలువలో దిగి రీల్స్ చేస్తుండగా విద్యార్థి ఒక్కసారిగా మునిగిపోయారు..

X
దిశ వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ప్రమాదక స్టంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. లైకులు పెంచుకునే క్రమంలో కొన్ని సమయాల్లో ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. రీల్స్ కోసం నలుగురు స్నేహితులు సీతానగరం మండలంలోని పేరంటమ్మ కాలువ వద్దకు వెళ్లారు. కాలువలోకి దిగి రీల్స్ చేస్తున్న సమయంలో వినయ్ అనే విద్యార్థి ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. స్నేహితులు, స్థానికులు రక్షించాలని ప్రయత్నం చేసినా విద్యార్థి నీటిలో గల్లంతయ్యారు. ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చీకటికావడంతో సెల్ ఫోన్ లైట్లతో గాలిస్తున్నారు.
Next Story






