వినరో భాగ్యము విష్ణు కథ..! అట్టహాసంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-30 06:29:40  IST  )

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల ఉత్తర ద్వార దర్శన పర్వం ప్రశాంతంగా కొనసాగుతోంది.

వినరో భాగ్యము విష్ణు కథ..! అట్టహాసంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..
X

దిశ, వెబ్‌డెస్క్: వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా తిరుమలలో భక్తుల ఉత్తర ద్వార దర్శనం కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు వైకుంఠ ద్వార ప్రదక్షిణం చేస్తున్నారు. మరోవైపు, ఆలయ ఆవరణలో స్వర్ణ రథోత్సవ కార్యక్రమం భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా జరుగుతోంది. ఉభయ దేవేరులు (శ్రీదేవి, భూదేవి)తో కలిసి శ్రీ మలయప్ప స్వామి వారు కాంతులీనుతున్న స్వర్ణ రథంపై మాడ వీధుల్లో ఊరేగుతున్నారు. గోవింద నామస్మరణతో తిరుమల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నిండిపోయింది.

కాగా, ఈ ఉత్సవాలు డిసెంబర్ 30 నుంచి 2026, జనవరి 8 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. లక్షలాది మంది భక్తులు ఈ సమయంలో దర్శన భాగ్యాన్ని పొందేందుకు తరలివస్తున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విస్తృత ఏర్పాట్లు చేసి భక్తులకు సురక్షితంగా సౌకర్యవంతంగా శ్రీవారి దర్శన అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

Next Story