బీభత్సం సృష్టించిన తుపాన్.. ప్రాంతాల వారీగా కురిసిన వర్షపాతం ఎంతంటే..?

by Malleboina Mahesh |   (  Updated:2025-10-29 09:57:52  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుపాన్ అతలాకుతలం చేసింది. ఈ తుపాను.. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో అర్ధరాత్రి 12.30 తర్వాత తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

బీభత్సం సృష్టించిన తుపాన్.. ప్రాంతాల వారీగా కురిసిన వర్షపాతం ఎంతంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుపాన్ (Montha Cyclone) అతలాకుతలం చేసింది. ఈ తుపాను.. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో అర్ధరాత్రి 12.30 తర్వాత తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) వెల్లడించింది. ప్రస్తుతం తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో తీవ్రంగా ఉంది. మొంథా తుపాను తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలింది. ‘మొంథా’ ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌ వద్ద మరింత బలహీన పడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈ తుపాను కారణంగా రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిశాయి.

గడిచిన 24 గంటల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల వారీగా నమోదైన అత్యధిక వర్షపాతం (Highest rainfall)పై వాతావరణ శాఖ అధికారులు బులిటెన్ విడుదల చేశారు. దీని ప్రకారం అత్యధికంగా కావలిలో 23.6 సెం. మీ వర్షపాతం నమోదు అయింది. అలాగే సింగరాయికొండలో 22.4 సెం. మీ, పొదిలి లో 21.6 సెం. మీ, చిన్నగంజాం లో 21.2 సెం. మీ, సంతనూతలపాడులో 20.8 సెం. మీ, ఒంగోలు అర్బన్ లో 20.7 సెం. మీ వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు. అలాగే ఉలవపాడులో 18.9 సెం. మీ, ఇంకొల్లులో 18.7 సెం. మీ, దగదర్తిలో 18.6 సెం. మీ, మద్దిపాడులో 18.4 సెం. మీ, దొనకొండలో 18.1 సెం. మీ, మర్రిపాలెం లో 16.8 సెం. మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ తుపాను కారణంగా రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

READ MORE .....

మొంథా ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Next Story