విద్యార్థులకు గుడ్ న్యూస్... గడువు పెంపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-16 01:06:17  IST  )

పాలిసెట్ రాస్తున్న విద్యార్థులకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ గుడ్ న్యూస్ తెలిపింది...

విద్యార్థులకు గుడ్ న్యూస్... గడువు పెంపు
X

దిశ, వెబ్ డెస్క్: పాలిసెట్ రాస్తున్న విద్యార్థులకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ(State Technical Education Department) గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ పాలిసెట్-2025(AP Polycet-2025) దరఖాస్తును పెంచుతూ నిర్ణయిం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 17వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. నేటితో ముగిసిన గడువును మరో రెండు రోజులు పెంచింది. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోని విద్యార్థులు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది. దీంతో విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

కాగా రాష్ట్రంలోని పాలిటెక్నికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ -2025 నోటిఫికేషన్‌ను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియకు ఏప్రిల్ 15వరకు అవకాశం కల్పించింది. టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు.. వారి హాల్ టికెట్ నెంబర్లను ఎంట్రీ చేసి దరఖాస్తు చేసుకోవాలని, మిగిలిన విద్యార్థులు మొబైల్ నెంబర్‌ను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు చేసే బీసీ, ఓబీసీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలని, ఎస్సీ, ఎస్టీలకు రూ. 100 ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. రాష్ర్టవ్యాప్తంగా 500 కేంద్రాల్లో ఏప్రిల్ 30న పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Next Story