- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇఫ్తార్ విందుల వేళ.. చంద్రబాబుపై మాజీ డిప్యూటీ సీఎం ఫైర్
రాష్ట్రంలో రంజాన్ శోభ నెలకొంది. భక్తి శ్రద్ధలతో ముస్లింసొదరులు ప్రార్ధనలు చేస్తున్నారు. ఇఫ్తార్ విందులతో సమాజ బంధాలను మరింత పటిష్టం చేస్తున్నారు..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రంజాన్(Ramdhan) శోభ నెలకొంది. భక్తి శ్రద్ధలతో ముస్లింసొదరులు ప్రార్ధనలు చేస్తున్నారు. ఇఫ్తార్ విందు(Iftar Dinner)లతో సమాజ బంధాలను మరింత పటిష్టం చేస్తున్నారు. ఎలాంటి భేదాలు లేకుండా అంతా కలిసి కూర్చుని భోజనం చేస్తూ భగవంతుడి ఎదుట అందరం సమానమే అనే భావన కలిగిస్తున్నారు.
పవిత్ర పుణ్య రోజుల్లోనూ..
అయితే ఈ రంజాన్, ఇఫ్తార్ విందులను కూడా కొందరు రాజకీయం చేస్తున్నారు. పవిత్ర పుణ్య రోజుల్లోనూ విమర్శలకు పాల్పడుతున్నారు. ఎదుట పార్టీలపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఇటీవల విజయవాడ(Vijayawada)లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగాన్ని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా(Former Deputy CM Amjad Basha) తప్పబట్టారు. ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు అసత్యలు మాట్లాడారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు చేసిందేమీ లేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు నెరవేర్చలేదని అంజాద్ బాషా విమర్శించారు.
జగన్ హయాంలోనే..
అయితే అంజాద్ బాషా చేసిన కామెంట్లపై టీడీపీ(Tdp) నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. జగన్(Jagan) హయాంలోనే ముస్లిం(Muslim)లకు ఎలాంటి పథకాలు అందలేదని విమర్శించారు. పండగలను కూడా రాజకీయాలకు వాడే పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు.






