- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఉగాదికల్లా నిర్మాణాలు పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న ఇళ్లను ఉగాది నాటికి పూర్తి చేసేందుకు రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం(Government) ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న ఇళ్ల(Houses)ను ఉగాది(Ugadhi) నాటికి పూర్తి చేసేందుకు రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మొత్తం ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అవసరమైన చర్యలను ఇప్పటికే ప్రారంభించింది. పేదలందరికీ పక్కా ఇల్లు నిర్మించాలని, ఆ లేఔట్‌లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు నాణ్యతతో కూడిన ఇళ్ళ నిర్మాణాలను ఉగాది నాటికి పూర్తి చేయడానికి రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఆయా ఇళ్ల నిర్మాణాలను ప్రతిరోజు తనిఖీ చేసి పూర్తి చేసే విధంగా అధికారులను ఆదేశించింది.
లబ్దిదారులు గృహప్రవేశం చేసుకునే విధంగా
ఇక పూర్తి చేసుకున్న ఇళ్లలో తక్షణం లబ్దిదారులు గృహప్రవేశం చేసుకునే విధంగా గృహ నిర్మాణ సంస్థ చర్యలు చేపట్టింది. ఇప్పటికే పూర్తయిన కాలనీలలో లబ్దిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటానికి ప్రణాళికను వెంటనే తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ శాఖలు పంచాయతీరాజ్, పురపాలక, పబ్లిక్ హెల్త్ విభాగాలతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. నిర్మాణాలు పూర్తి అయిన ఇళ్లలోనికి లబ్దిదారులు చేరే బాధ్యతను కూడా అధికారులే తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ ఆదేశించింది.






