రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రూ. 7 వేలు

by Vemula.Srinu Prasad |

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఖాతాల్లోకి రాష్ట్రప్రభుత్వం రూ. 7 వేలు జమ చేయనున్నారు..

రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రూ.  7 వేలు
X

దిశ, వెబ్ డెస్క్: రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. రైతులను ఆదుకునేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. ప్రధానంగా అన్నదాత సుఖీభవతో ప్రతి ఏడాది రూ. 20 వేలు అందించేందుకు సిద్ధమయ్యాయి. ఈ పథకం తొలి విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఈ శనివారం మధ్యాహ్నంకల్లా ప్రతి రైతు అకౌంట్లో రూ. 7 వేలు జమకానున్నాయి. రాష్ట్రం తరపున రూ. 5 వేలు, కేంద్రం నుంచి రూ. 2 వేలు రైతులకు అందించనున్నారు. శనివారం ఉదయం నుంచి అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల అకౌంట్లలో జమ అవుతాయని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రంలోని 46, 85, 88 రైతు కుటుంబాలకు లబ్ధిచేకూరనుందని ఆయన తెలిపారు. మొత్తం రూ. 2,342,92 కోట్లు నేరుగా రైతుల అకౌంట్లలోకి చేరనున్నాయన్నారు. పేదల సంక్షేమం దిశగా ప్రభుత్వం అడుగులో వేస్తోందని, విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద రూ. 15 వేలను తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకురాబోతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను సైతం తమ ప్రభుత్వం చెల్లిందని, తద్వారా 85 వేల మంది రైతులకు మంచి జరిగిందని తెలిపారు. రైతులు విక్రయించిన ప్రతి ధాన్యానికి లెక్క కట్టి ఆ డబ్బులను ఒక్క రోజు గడువులోనే అందిస్తున్నామని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Next Story