పారిశ్రామికవేత్తలకు గుడ్ న్యూస్.. భారీగా ప్రోత్సాహకాలు విడుదల

by Vemula.Srinu Prasad |

దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది....

పారిశ్రామికవేత్తలకు గుడ్ న్యూస్.. భారీగా ప్రోత్సాహకాలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. ఇందులో భాగంగా రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేసింది. ఈ విడతలో 3,122 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.53.05 కోట్లు, 495 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.7.16 కోట్లు విడుదల చేసింది. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలను ఈ రంగంలో మరింతగా వృద్ధిలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 11,451 మంది పారిశ్రామికవేత్తలకు రూ.269.90 కోట్లను పారిశ్రామిక ప్రోత్సాహకాల రూపంలో అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు దశలుగా ప్రోత్సాహకాలు అందించింది. మొదటి విడతగా 2025 అక్టోబర్ నెలలో 6,675 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.178.75 కోట్లు, 1,159 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.30.94 కోట్లు విడుదల చేసింది.

కాగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, ఆమోదం పొందిన యూనిట్లన్నింటినీ కవర్ చేయాలనే ఉద్దేశంతో బడ్జెట్ లభ్యత ఆధారంగా రెండో విడత నిధులను విడుదల చేసింది. ఈ విధంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రెండు విడతలలో కలిపి 9,797 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.231.80 కోట్లు, 1,654 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.38.10 కోట్లు అందించింది. పరిశ్రమల తక్షణ అవసరాలు, దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ సహాయం ఎంతో దోహదపడుతుంది.

Next Story