బెల్ట్​షాపులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది...

బెల్ట్​షాపులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మద్యం బెల్ట్ షాపుల(Liquor Belt shops)పై కీలక నిర్ణయం తీసుకుంది. బెల్డ్ షాపుల నియంత్రణపై హర్యానా మోడల్ విధానం(Haryana Model Policy)పై అధ్యయనం చేయాలని భావిస్తోంది. ప్రతి బాటిల్‌పై నెంబర్ కేటాయించే ఆలోచన చేస్తోంది. అలాగే మద్యంపై లాటరీ, రిటైల్ విధానంపైనా పున:పరిశీలన చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనధికార విక్రయ కేంద్రాలపై కఠినంగా వ్యవహించాలన్నారు. గ్రామీణ, దూర ప్రాంతాల్లో మద్యం షాపులు లేవని, దాని బెల్ట్ మార్కెట్ పెరుగుతోందని చెప్పారు. పర్యావరణ పరిరక్షనలో భాగంగా మద్యం సీసాను తిరిగిస్తే నగదు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story