'మహా' పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్.. మంత్రి ఆనం అధికారిక ప్రకటన

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే గోదావరి పుష్కరాలకు రంగం సిద్ధమవుతోందని, 2027 జూన్ 26 నుంచి ఈ మహా పుష్కరాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారికంగా ప్రకటించారు..

మహా పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్.. మంత్రి ఆనం అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే గోదావరి పుష్కరాల(Godavari Pushkaralu)కు రంగం సిద్ధమవుతోందని, 2027 జూన్ 26 నుంచి ఈ మహా పుష్కరాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Minister Anam Ramanarayana Reddy) అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిందని, రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే మూడు కీలక సమావేశాలు నిర్వహించి, పుష్కరాల ఏర్పాట్లపై ప్రాథమిక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అత్యున్నత ప్రమాణాలతో సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

పుష్కరాల నిర్వహణపై మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు

పుష్కరాల నిర్వహణను పర్యవేక్షించేందుకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) నేతృత్వంలో ప్రత్యకమైన మంత్రుల సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశామని మంత్రి ఆనం తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతానికి చెందిన 12 మంది మంత్రులతో కూడిన ఈ కమిటీ, క్షేత్రస్థాయిలో పనులను సమన్వయం చేయనుందని ఆయన చెప్పారు. ఘాట్ల నిర్మాణం, రవాణా సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్యంపై ఈ కమిటీ నిరంతరం సమీక్షలు జరుపుతుందన్నారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Next Story