జడ్పీటీసీలు వర్సెస్ ఎమ్మెల్యేలు.. జడ్పీ సమావేశం రచ్చ...రచ్చ

by Vemula.Srinu Prasad |

శ్రీకాకుళం జడ్పీ సర్వసభ్య సమావేశం రచ్చకు దారి తీసింది..

జడ్పీటీసీలు వర్సెస్ ఎమ్మెల్యేలు.. జడ్పీ సమావేశం రచ్చ...రచ్చ
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జడ్పీ సర్వసభ్య సమావేశం(Srikakulam ZP Conference) రచ్చకు దారి తీసింది. ఈ రచ్చ వైసీపీ(Ycp) జడ్పీటీసులు, ఎంపీపీల వర్సెస్ కూటమి ఎమ్మెల్యేలుగా మారింది. సమావేశంలో మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వడంలేదంటూ జడ్పీటీసులు, ఎంపీపీలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది. అరుపులు, కేకలతో జడ్పీ హాలు దద్దరిల్లింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు. నెలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. చివరకు ఎమ్మెల్సీ విక్రాంత్, జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి జోక్యం చేసుకోవడంతో ఇరువర్గాల నేతలు శాంతించాయి.

Next Story