శ్రీ‌ గోవింద‌రాజ‌స్వామి ఆల‌య ఘ‌ట‌న దారుణాతి దారుణం

by Thanuru Gopichand |

టీటీడీలో భద్రతా వైఫల్యంపై బోర్డు మాజీ చైర్మన్ విమర్శలు.

శ్రీ‌ గోవింద‌రాజ‌స్వామి ఆల‌య ఘ‌ట‌న దారుణాతి దారుణం
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతిలోని (Tirupati) శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ (Govinda Raja Swamy Temple) ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి (Bhumana Karunakara Reddy) సీరియస్ గా స్పందించారు. ఘటనను దారుణాతి దారుణమైనదిగా అభివర్ణించారు. విషయంపై శనివారం స్పందిస్తూ ఒక మద్యం సేవించిన వ్యక్తి ఏకంగా టీటీడీ అనుబంధ దేవాలయంలోని రాజగోపురంపైకి ఎక్కడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందులోనూ సదరు వ్యక్తి తనకు మద్యం కావాలని డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టారు. అక్కడ వరకు మద్యం తాగిన వ్యక్తి చేరుకున్నాడంటే భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో టీటీడీ ప్రతిష్ఠ పూర్తిగా మంటగలిసే పరిస్థితి నెలకొందని విమర్శించారు.

తిరుమల కొండపై మద్యం, మాసం దొరుకుతున్నాయని ఆరోపణలు గుప్పించారు. తరచూ భద్రతా వైఫల్యాలు వెలికి వస్తున్నా.. వాటిని సవరించుకునే ప్రయత్నం జరగడం లేదని అన్నారు. ఇప్పటి వరకు భక్తుల భద్రతకే అనుకుంటే ఇప్పుడు టీటీడీ ఆధ్వర్యంలో దేవాలయాల భద్రతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. చైర్మన్ బీఆర్ నాయుడు వీఐపీ సేవల్లో తరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన దర్శనాల చిట్టా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎంఓ నుంచి వచ్చే సిఫార్సు లేఖలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు ఎందుకు తక్కువగా వచ్చారనే సమీక్ష కూడా జరగలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా దేవాలయాలు, భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని భూమన కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story