తిరుమలలో విమానం కలకలం.. ఆందోళనలో భక్తులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-08 07:59:14  IST  )

తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం కన్పించడం కలకలం రేగింది...

తిరుమలలో విమానం కలకలం.. ఆందోళనలో భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయం(Tirmala Srivari Temple)పై మరోసారి విమానం కన్పించడం కలకలం రేగింది. గురువారం ఉదయం 9 గంటలకు తిరుమల ఆకాశ మార్గంలో విమానం(Flight) ప్రయాణించింది. కొందరు భక్తులు గమనించి టీటీడీ(TTD) దృష్టికి తీసుకెళ్లారు. ఆగమన శాస్త్రానికి విరుద్ధంగా తిరుమల ఆలయం పరిసరాల్లోకి విమానం రావడంపై భక్తులు అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తిరుమల ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడంపై అటు టీటీడీ అధికారులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. కేంద్ర విమానయాన శాఖకు సమాచారం అందించారు.

కాగా పాకిస్థాన్, భారత్ మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు తిరుమలలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సమయంలో ఆకాశ మార్గాన విమానం చక్కెర్లు కొట్టడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు భారత్ సరిహద్దులో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దీటుగానే బలగాలు సమాధానం ఇస్తున్నా.. ఇలాంటి విషయంలో అప్రమత్తత తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భారత సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొనే వరకూ తిరుమల వైపు విమానాలు రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర విమానయాన శాఖకు ఉందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ ఘటనపై చూడాలి మరి ఏం జరుగుతుందో..?

Next Story