- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాడేరు ఏజెన్సీలో వణికిస్తున్న చలి
తగ్గుముఖం పట్టని చలి. ఏజెన్సీ ప్రాంతాన్ని కమ్మేస్తున్న పొగమంచు.

దిశ, వెబ్ డెస్క్ : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ (Paderu Agency) ప్రాంతంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ మన్యవాసులను గజగజ వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో ఏజెన్సీలోని గిరిజన గ్రామాలు చలి (Cold) గుప్పిట్లో చిక్కుకున్నాయి. తాజా గణాంకాల ప్రకారం అరకు లోయలో అత్యల్పంగా 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత (Temperature) నమోదు కాగా, మినుమలూరులో 8 డిగ్రీలు, చింతపల్లిలో 9.2 డిగ్రీలు, పాడేరు జిల్లా కేంద్రంలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ తీవ్రమైన చలికి తోడు తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు, ముఖ్యంగా ఘాట్ రోడ్లపై ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనాలు హెడ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిరిజన ప్రాంతాల్లో ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు ఈ విపరీతమైన చలి కారణంగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలి ప్రభావం వల్ల వ్యవసాయ పనులు కూడా ఆలస్యంగా మొదలవుతున్నాయి. అయితే మరోవైపు ఈ చలి వాతావరణం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. మంచు అందాలను వీక్షించేందుకు అరకు, వంజంగి మేఘాలకొండ వంటి పర్యాటక ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరిగింది. రానున్న మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.






