- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతిలో కీలక ప్రక్రియ షురూ.. ఆ రోజే లాస్ట్ డేట్
అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైంది..

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)లో రెండో దశ ల్యాండ్ పూలింగ్(Second Phase land Pooling) ప్రక్రియ కొనసాగుతోంది. రాజధాని విస్తరణలో భాగంగా గతంలో సేకరించిన భూముల కంటే మరిన్ని ఎకరాలు కావాలని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు రైతులు(Farmers) సైతం ముందుకు వచ్చారు. దీంతో రెండో దశ ల్యాండ్ ఫూలింగ్‌లో పెదపరిమి, వడ్లమాను, వైకుంఠపురం, హరిశ్ఛంద్రాపురం, పెద్దమద్దూరు, యండ్రాయి, కర్ణపూడి, లేమల్లెలో పట్టాతో పాటు అసైన్డ్ భూములను సేకరిస్తున్నారు. మొత్తం 16,666.57 ఎకరాలను రైతులను నుంచి తీసుకుంటున్నారు. వీటితో పాటు 3828.56 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం అమరావతి విస్తరణకు సేకరిస్తున్నారు. ప్రస్తుతం భూసమీకరణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. ఈ ప్రక్రియకు ఫిబ్రవరి 28న తుది గడువుగా ప్రకటించారు.
శరవేగంగా అమరావతి నిర్మాణ పనులు
మరోవైపు అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని భవనాల్లో కార్యకలాపాలు నడుస్తున్నాయి. మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అటు మౌలిక సదుపాయాల కల్పన పనులు కూడా ఊపందుకున్నాయి.






