- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు సంబంధం లేదు: 30కి పైగా ప్రశ్నలకు వంశీ సమాధానం ఇదే..!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి రెండో రోజు కస్టడీ ముగిసింది...

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి రెండో రోజు కస్టడీ(Custody) ముగిసింది. ఈమేరకు ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించారు. నూజివీడు కోర్టు(Nuziveedu Court) ఇచ్చిన ఆదాశాలతో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు(Fake house title deed distribution case)లో వంశీని 2 రోజుల పాటు కంకిపాడు పోలీసులు ప్రశ్నించారు. 2 రోజుల్లో 30కిపైగా ప్రశ్నలు అడిగారు. ‘నకిలీ ఇళ్ల పట్టాలను ఎవరు.. ఎందుకు తయారు చేశారు..?’ అని ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నలకు తనకు నకిలీ పట్టాలతో సంబంధ లేదని వంశీ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా తొలి రోజు కస్టడీ ముగియడంతో వల్లభనేని వంశీని కంకిపాడు పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. అయితే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించారు. అనంతరం శనివారం ఉదయం రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. సాయంత్రానికి కస్టడీ ముగియడంతో మళ్లీ జైలుకు తరలించారు. వల్లభనేని వంశీపై ఇప్పటికే పలు కేసులు ఉన్న విషయం తెలిసిందే. ఆయా కేసుల్లో ఆయన రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడుపుతున్నారు.






