- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ ముందుకు వచ్చిన సముద్రం.. ప్రజల్లో భయాందోళనలు
కాకినాడ జిల్లాలో సముద్రం భయాందోళనలను కలిగిస్తోంది..

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లాలో సముద్రం భయాందోళనలను కలిగిస్తోంది. పిఠాపురం మండల న్యూ కొత్తపల్లి వద్ద మళ్లీ సముద్రం భారీగా ముందుకు వచ్చింది. సముద్రంలో కెరటాల భారీ ఎత్తున ఎగిపడుతున్నాయి. తీరం వెంబడి ఉన్న మాయాపట్నంలోనూ సముద్రం ముందుకు వచ్చింది. సముద్రం తాకిడి దెబ్బకు సూరారంపేట కోతకు గురవుతోంది. అమీనాబాద్ శివారులోని రోడ్డు సైతం కోతకు గురైంది. ఇక్కడ అయితే తొలిసారి సముద్రం ముందుకు వచ్చింది. పల్లెపేట వద్ద సముద్రంలో అలల ఉధృతి అధికంగా ఉంది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ శివారు వరకూ సముద్రపు అలలు ఉధృతంగా కొనసాగుతోంది. తీర ప్రాంతంలో సముద్రం ముందుకు రావడంతో పాటు ఇళ్ల వద్దకు చేరుకుంటున్నాయి. దీంతో స్థానికుల్లో అలజడి రేగింది. మరో రెండు రోజుల పాటు ఇలానే కొనసాగితే చాలా ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.






