- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగావళి ఉగ్రరూపం.. మునిగిపోయిన సంగమేశ్వరాలయం
నాగావళి ఉగ్రరూపంతో సంగమేశ్వరాలయం మునిగిపోయింది...

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్ర(Uttarandra)ను వర్షాలు(Rains) వణికించాయి. బంగాళాఖాతం(Bangalakhatam)లో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరంపై వాయుగుండం ఎఫెక్ట్ భారీగా పడింది. ఎడతెరిపిలేకుండా వర్షం దంచికొట్టింది. దీంతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీనికి తోడు ఎగువకురిసిన వర్షాలు శ్రీకాకుళం(Srikakulam) జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. జిల్లాలోని వంశధార(Vamsadhara), నాగావళి(Nagavali) నదులకు వరద ప్రవాహం భారీగా చేరింది. ఈ మేరకు రెండు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
అయితే నాగావళి నది మాత్రం ఉగ్రరూపం దాల్చింది. దీంతో నదీ పరివాహకంలో చాలా గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా బాసింగిలో గుంప సంగవేశ్వరస్వామి ఆలయం నీటిలో మునిగిపోయింది. అటు హీరమండలంలో వంశధార నదికి ఉధృతి పెరిగింది. దీంతో గొట్ట బ్యారేజ్ సమీపంలోని గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరింది. బోటు మీద వెళ్లి గ్రామస్తులకు ఆహారం అందించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు వంశధార ఉప నది మహేంద్రతనయకూ వరద పోటు పెరిగింది. దీంతో సమీప ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.






