Ontimitta: 24 నుంచి కోదండరామస్వామి పవిత్రోత్స‌వాలు

by Vemula.Srinu Prasad |

ఆగ‌స్టు 24 నుంచి 26 వ‌ర‌కు ఒంటిమిట్ట కోదండరామస్వామి పవిత్రోత్సవాలు జ‌రగ‌నున్నాయి..

Ontimitta: 24 నుంచి కోదండరామస్వామి పవిత్రోత్స‌వాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆగ‌స్టు 24 నుంచి 26 వ‌ర‌కు ఒంటిమిట్ట కోదండరామస్వామి పవిత్రోత్సవాలు(Ontimitta Kodandaramaswamy Pavitrotsavalu) జ‌రగ‌నున్నాయి. ఈ ఉత్సవాలకు ఆగ‌స్టు 23న సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణం చేయనున్నారు. ఇక ఆగ‌స్టు 24న ఉదయం చ‌తుష్టానార్చ‌న‌, ప‌విత్ర ప్ర‌తిష్ట‌, సాయంత్రం ప‌విత్ర‌హోమం, నివేద‌న‌, శాత్తుమొర నిర్వహించనున్నారు. ఆగ‌స్టు 25న ఉద‌యం ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, సాయంత్రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 26న ఉద‌యం మ‌హా పూర్ణాహుతి, ప‌విత్ర విస‌ర్జ‌న‌, కుంభ‌ప్రోక్ష‌న, సాయంత్రం సీతా ల‌క్ష్మ‌ణ స‌మేత కోదండ‌రామ‌స్వామి ఉత్స‌వ‌ర్ల ఊరేగింపు నిర్వ‌హించ‌నున్నారు.

కాగా వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు కోదండరామస్వామి పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఏడాది కూడా ఈ పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story