- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజువారీ లాగానే వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనానికి తరలివస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజువారీ లాగానే వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనానికి తరలివస్తున్నారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులతో తిరుమల కొండ కళకళాలాడుతోంది. భక్తులు కూడా మెట్ల మార్గంలో, బస్సులో కొండకు చేరుకుంటున్నారు. స్లాట్ బుక్ చేసుకున్నవారు కూడా స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు వస్తున్నారు. సర్వదర్శనం భక్తులు కూడా క్యూలైన్లలో వరుస కడుతున్నారు. తిరుమల సిబ్బంది తనిఖీలు చేసి భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. వారాంతం సమీపించడంతో తిరుపతి, తిరుమలలోని దేవస్థానాలకు భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శననానికి 8 గంటల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. వేలాది మంది భక్తులు దేవస్థానం ఆవరణలోని 26 కంపార్టుమెంట్లలో స్వామి వారిని దర్శించుకునేందుకు వేచి ఉన్నారన్నారు. వారికి కావలసిన వసతులు, ప్రసాదాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. స్వామి వారిని శుక్రవారం 67,202 మంది భక్తులు దర్శించుకున్నారని అన్నారు. 25,864 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.04 కోట్ల రూపాయలని తెలియజేశారు.
తిరుమల స్వామి వారిని దర్శించుకున్న రజనీకాంత్
తిరుమల స్వామివారిని ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారని టీటీడీ అధికారులు తెలిపారు. పండితులు రజనీకాంత్ కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందజేశారు.






