తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

by Jakkula.Mamatha |

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(గురువారం) శ్రీవారి దర్శనానికి 8 నుంచి 12 గంటల సమయం పడుతోంది. 9 కంపార్ట్‌‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(బుధవారం) శ్రీవారిని 70,472 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,247 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.85 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

Next Story