ఆర్టీసీ బస్సు ఆపలేదని.. ఛేజ్​ చేసి మరీ బస్సు ఆపి..

by Thanuru Gopichand |

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలుకాకముందే.. పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాను.

ఆర్టీసీ బస్సు ఆపలేదని.. ఛేజ్​ చేసి మరీ బస్సు ఆపి..
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలుకాకముందే.. పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాను. ఆర్టీసీ బస్సు ఆపలేదని ఓ మహిళ డ్రైవర్‌పై దురుసుగా ప్రవర్తించినట్లు వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అనంతపురం జిల్లా జిల్లా సర్పాల మండలం నడిమివంక గ్రామం వద్ద బస్సు కోసం మహిళ వేచి ఉంది. అనంతపురం నుండి కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న బస్సు ఆపకుండా వెళ్లింది. దీంతో ఆమె బైకుపై ఓవర్ టేక్ చేసి బస్సు ఆపి డ్రైవర్ తో వాగ్వాదానికి దిగింది. బస్సు ఎందుకు ఆపలేదని డ్రైవర్ చెంప పగలగొట్టినట్లు చెబుతున్నారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story