- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమా స్టైల్లో భారీ దోపిడీ.. కళ్లల్లో కారంకొట్టి కేజీ బంగారం చోరీ
పల్నాడు జిల్లా కారంపూడిలో జరిగిన దోపిడీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సినీ ఫక్కీని తలపించేలా దుండగులు పక్కా స్కెచ్‌తో చోరీకి పాల్పడ్డారు. బంగారు ఆభరణాలను తరలిస్తున్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు.. ఒక్కసారిగా అతడిపై దాడి చేసి కళ్లల్లో కారం కొట్టారు..

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu District) కారంపూడి(Karampudi)లో జరిగిన దోపిడీ(Robbery) స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సినీ ఫక్కీని తలపించేలా దుండగులు పక్కా స్కెచ్‌తో చోరీ(Theft)కి పాల్పడ్డారు. బంగారు ఆభరణాలను తరలిస్తున్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు.. ఒక్కసారిగా అతడిపై దాడి చేసి కళ్లల్లో కారం కొట్టారు. బాధితుడు తేరుకునేలోపే కేజీ బంగారాన్ని లాక్కొని పరారయ్యారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటనతో వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది.
రంగంలోకి ప్రత్యేక టీమ్స్
ఈ భారీ చోరీ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. నిందితులు ముందుగానే రెక్కీ నిర్వహించి ఉంటారని భావిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దోపిడీ దొంగల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రధాన రహదారులపై నాకాబందీ నిర్వహిస్తున్నారు. అనుమానిత వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.






