చంద్రబాబు బాటలోనే జగన్.. చేతి వేలికి కొత్త రింగ్... !

by Vemula.Srinu Prasad |

వైఎస్ జగన్ చేతి వేలికి పెట్టుకున్న ఉంగరం హాట్ టాపిక్ గా మారింది..

చంద్రబాబు బాటలోనే జగన్.. చేతి వేలికి కొత్త రింగ్... !
X

దిశ, వెబ్ డెస్క్: చేతి వేలికి పెట్టుకునే ఉంగరాలు రాజయోగాన్ని(Rajayogam) తెచ్చిపెడతాయని కొందరు అంటుంటారు. మరి యాదృశ్చికమో, ఉంగరం(Ring) వల్లో తెలియదు గాని కొంతమంది విషయంలో అది నిజమని తేలింది. దీంతో చాలామంది నేతలు, ప్రముఖులు ఇలా ఉంగరం ధరించడం మనం చూశాం. అంతేకాదు ఈ ఉంగరం వల్లే తమకు ఈ అధికారం, సంపదన వచ్చిందని బహిరంగంగానే చెప్పారు.

అయితే వైఎస్ జగన్(Ys Jagan) లాంటి వ్యక్తులు కూడా ఇలాంటి ఉంగరాలు ధరించడం వైరల్‌గా మారింది. గతంలో ఆయన చేతి వేళ్లకు ఎప్పుడూ కనిపించని ఉంగరం తాజా పర్యటనలో తలుక్కున మెరుస్తోంది. సాధారణంగా జగన్ తన పర్యటన, కార్యకర్తల సమావేశంలో రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కసారిగా అభివాదం చెబుతూ ముందుకు నడుస్తుంటారు. అయితే ఆ సమయంలో ఉట్టి చేతులు మాత్రమే కనిపించేవి. కానీ ప్రస్తుతం ఆయన చేతి వేలుకు ఓ ప్రత్యేకమైన ఉంగరం మెరుస్తోంది. ఆయన మధ్య వేలుకు బ్లూ కరల్ రాయితో ఉన్న ఉంగరం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ ఉంగరం అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు చిత్ర, విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు.

2024 ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) సైతం చేతి వేలికి ఉంగరం ధరించిన విషయాన్ని గుర్తు చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. అధికారం పోవడంతో జగన్ కూడా చంద్రబాబు సెంట్ మెంట్‌ను ఫాలో అవుతున్నారని మరికొందరు పోస్టులు పెడుతున్నాయి. అయితే చంద్రబాబు తన ఆరోగ్యం దృష్ట్యా ఉంగరం పెట్టుకున్నారని, అందులో ఉండే చిప్ గుండె వేగం, బీపీ ఎంత ఉంది. ఎన్ని గంటలు పని చేశారు. ఎంత రెస్ట్ తీసుకున్నారనే విషయాలను తెలుపుతుందని చెబుతున్నారు. కానీ జగన్ మాత్రం.. ప్రతిపక్షంలో ఉండటం వల్ల బీపీ పెరిగి ఉంటుందని, ప్రతిపక్ష హోదా లేకపోవడంతో రాత్రిళ్లు నిద్ర పోవడం లేదని అందుకే హెల్త్ ట్రాక్ కోసం వైద్యులు ఈ రింగ్ పెట్టుకోమని చెప్పి ఉంటారని కొందరు టీడీపీ(Tdp) నేతలు, కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా కొత్తగా జగన్ చేతి వేలకు వచ్చి ఉంగరం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Next Story