- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap Results: మరికొన్ని గంటల్లో ప్రజా తీర్పు.. గెలిచేది ఆ పార్టీనేనా..?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ...

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామాల్లో మహిళలు, పురుషులు, వృద్ధులు ఎండలను సైతం లెక్క చేయకుండా వచ్చి ఓటు వేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా పోలింగ్ శాతం నమోదు అయింది. ప్రస్తుత అభ్యర్థుల భవితవ్యం తెలిసిపోయే క్షణాలకు ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం ఉదయం 8 గంటలకే లెక్కింపు కార్యక్రమం ప్రారంభంకానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్ కొనసాగనుంది. త్వరగానే తొలి ఫలితం వెలువడనుంది. ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో గెలుపు, ఓటములపై నరాల తెగే ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు అధికారం ఎవరిదనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ప్రధానంగా వైసీపీ, టీడీపీ కూటమి మధ్యే టఫ్ ఫైట్ నడిచినట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ సైతం స్పష్టంగా చెప్పలేకపోయాయి. మరీ ముఖ్యంగా అసెంబ్లీ పరిధిలో ఎగ్జిట్ పోల్స్ అస్పష్టంగా కనిపించాయి. కొన్ని సంస్థలు వైసీపీకి అనుకూలంగా చెప్పగా.. మరికొన్ని సంస్థలు టీడీపీ కూటమిదే అధికారమని తేల్చాయి. ఈ నేపథ్యంలో గెలిచేదెవరు..? ఓడేదెవరు అనే ప్రశ్నలు విపరీతంగా వినిపిస్తున్నాయి. అటు ఆయా పార్టీలు మాత్రం తమకే అనుకూలమని చెప్పుకుంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.






