- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ జిల్లాలో 4 వేల పెన్షన్లు తొలగింపు: మాజీ మంత్రి ఫైర్
రాష్ట్రంలో దివ్యాంగులకు పెన్షన్లు తొలగింపు విమర్శలకు దారి తీసింది...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో దివ్యాంగుల(Disabled)కు పెన్షన్లు(Pensions) తొలగింపు విమర్శలకు దారి తీసింది. గత ప్రభుత్వం అనర్హులు పెన్షన్లు పొందారని, వారందరికి కట్ అవుతాయని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అర్హులకు కట్ అయితే అధికారులను కలిసి సరిచేయించుకోవాలని తెలిపింది.
అయితే పలువురికి పెన్షన్ల కట్ అవడంపై వైసీపీ(Ycp) నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. పెన్షన్ కట్ అయిన వారితో కలిసి ఆ పార్టీ నేతలు పలుచోట్ల నిరసనలు వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోనూ పలువురు దివ్యాంగులు నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్(Former Minister Dharmana Krishna Das) ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున దివ్యాంగుల పెన్షన్లు తొలగించారని ఆరోపించారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 4 వేల పెన్షన్లు తొలగించారని తెలిపారు. అడ్డగోలుగా పెన్షన్లు తొలగించటం దారుణమని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.






