- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాణికులకు ముఖ్య గమనిక.. తాత్కాలికంగా ఆ రైళ్లు రద్దు
పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది...

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో రైల్వే ప్రయాణాలు(Journey) మరింత పెరిగాయి. కొందరు సొంతూళ్ల ఊళ్లకు వెళ్తుంటే.. మరికొందరు విహారయాత్రలకు వెళ్తున్నారు. ఇంకొందరు అవసరాల నిమిత్తం రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రయాణాలకు రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో పలు రైళ్లలో రద్దీ కొనసాగుతోంది. జనరల్ జర్నీలో అయితే రద్దీ అధికంగా ఉంటుంది. అయినా సరే ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్నారు. అయితే కొన్ని సమయాల్లో ప్రయాణికులకు నిరాశ ఎదురవుతోంది. అనివార్య కారణాల వల్ల రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటిస్తున్నారు.
తాజాగా కూడా ఇలాంటి ప్రకటన రైల్వే శాఖ(Railway Department) నుంచి వెలువడింది. సాంకేతిక కారణాల వల్ల పలు రైళ్లను(Trains) రద్దు చేసింది. విశాఖ-షాలిమార్ ఒరిజినేటింగ్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నె 24న సంత్రాగచ్చి-చెన్నై (22807) ఎక్స్‌ప్రెస్, షాలిమార్-విశాఖ (22853) ఎక్స్‌ప్రెస్, 26న విశాఖ-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ (22854), 27న చెన్నై సెంట్రల్-సంత్రాగచ్చి (22808) ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.






