- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ వాసులకు అలర్ట్.. 14 రైళ్లు రద్దు
విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ వాసులకు రైల్వే శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున రైళ్లు రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. రాజమండ్రి- విశాఖ, మచిలీపట్నం-విశాఖ, తిరుపతి-కాకినాడ, గుంటూరు-విశాఖ, గుంటూరు-రాయగడ, విశాఖ-మహబూబ్ నగర్, గుంటూరు-విశాఖ తదితర ప్రాంతాలకు వెళ్లే 14 రైళ్లను రద్దు చేశారు. జూన్ 4 వరకూ వివిధ రోజుల్లో ఈ రూట్లలో రైళ్లను రద్దు చేశారు. రద్దు అయిన రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే పొందుపర్చినట్లు అధికారులు తెలిపారు. ఈ వివరాలు తెలుసుకుని ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవాలని ప్రయాణికులకు రైల్వే అధికారులు సూచించారు.
- Tags
- irctc
Next Story






