- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిఠాపురం పాలిటిక్స్: వర్మకు చంద్రబాబు వార్నింగ్
పిఠాపురం నియోజకవర్గంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ రగడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.. ఈ వివాదంపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పిఠాపురం(Pithapuram) నియోజకవర్గంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ రగడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu), టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ(Tdp Leader Nvsn Varma) తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో నేతలందరూ ఐక్యంగా ముందుకు సాగాలని, ప్రోటోకాల్ సాకుతో ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జనసేన(Janasena) నేతలతో కలిసి పని చేయాల్సిన సమయంలో ఇలాంటి విభేదాలు తగవంటూ వర్మకు సూచించారు.
అయితే ముఖ్యమంత్రి నిర్ణయంపై వర్మ అనుచరులు సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. తమ నాయకుడిపై దాడికి ప్రయత్నించినప్పుడు జనసేన కార్యకర్తలు రక్షణగా నిలవాల్సింది పోయి, తిరిగి వర్మనే తప్పుబట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడే నేతలకు గుర్తింపు లేకుండా పోతోందని, సీఎం తీసుకున్న ఈ సీరియస్ నిర్ణయం తమను తీవ్రంగా కలచివేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






