ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్.. ASHA సంచలన నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-15 10:44:19  IST  )

రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల ఓపీడీని నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది...

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్.. ASHA సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల(NTR Medical Services) ఓపీడీని నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్(ASHA) ప్రకటించింది. అన్ని అస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు ఇప్పటి వరకూ కానసొగించామని, ఇందుకు రూ.2,000 కోట్ల వరకూ చెల్లించాలని, పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది.


ఐవీఆర్ఎస్ కాల్స్ వల్ల ప్రజలు తమపై నమ్మకం కోల్పోతున్నారంటూ లేఖలో అసోసియేషన్ తెలిపింది. ఆస్పత్రుల నెలవారీ నిర్వహణను చేయలేకపోతున్నామని, బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరింది. ఇప్పటికే సామర్థానికి మించి సేవలు అందించామని, బకాయిలు ఇవ్వలేని నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్య సేవల ఓపీడీని కొనసాగించలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారని లేఖలో ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

Next Story