- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిథున్‌రెడ్డికి ఇంటి భోజనాన్ని అనుమతించలేం: జైళ్ల శాఖ
ఎంపీ మిథున్ రెడ్డికి జైళ్ల శాఖ బిగ్ షాక్ ఇచ్చింది..

దిశ, వెబ్ డెస్క్: దిశ, వెబ్ డెస్క్: మద్యం కేసు(Liquor case)లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy) రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఇంటి భోజనం విషయంలో విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court)ను జైళ్ల శాఖ ఆశ్రయించింది. మిథున్ రెడ్డికి ఇంటి భోజనం అనుమతించలేమని, అటెండర్ సౌకర్యం కూడా కల్పించలేమని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
కాగా మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కోర్టు రిమాండ్ విధించిండంతో రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయన ఇంటి భోజనం కోరడంతో జైలు అధికారులు అనుమ తించారు. ప్రతి రోజు ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్ని జైలు సిబ్బంది మిథున్ రెడ్డికి అందజేస్తున్నారు. కానీ ప్రతి రోజు కావడంతో జైలు సిబ్బందికి అసౌకర్యంగా ఉంది. దీంతో మిథున్ రెడ్డికి ఇంటి భోజనం అనుమతించలేమని కోర్టు దృష్టికి జైళ్ల శాఖ తీసుకెళ్లింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.






