- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని ఈ అంశాలపై క్లారిటీ ఇచ్చి రావాలి.. మోడీ ఏపీ టూర్ పై వైఎస్ షర్మిల విమర్శలు
ఆనాడు మట్టి కొట్టి, ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారా అని, రాజధాని అంశంలో ఇచ్చిన హామీ మర్చిపోయారా? అని ప్రధాని మోడీని ఉద్దేశించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(AP Congress Chief YS Sharmila) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆనాడు మట్టి కొట్టి, ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారా అని, రాజధాని అంశంలో ఇచ్చిన హామీ మర్చిపోయారా? అని ప్రధాని మోడీని ఉద్దేశించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(AP Congress Chief YS Sharmila) అన్నారు. మోడీ ఆంధ్ర పర్యటన(PM Modi AP Tour) పై స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా షర్మిల.. చెంబేడు నీళ్ళు, గుప్పెడు మట్టి ఇదే అమరావతికి ప్రధాని మోడీ చేసిన సహాయం అని, ఆనాడు గాలి మోటార్లో తిరిగి ఆంధ్రుల నెత్తి మీద మట్టి కొట్టి, ఇప్పుడు మళ్ళీ సున్నం కొట్టడానికి వస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరికి ఆత్మగౌరవం అమరావతిని "మోడీ శంకుస్థాపనల ప్రాజెక్ట్ " కింద మార్చేశారని, రాజధాని నిర్మాణంపై బీజేపీ (BJP) చేస్తున్నది ఘరానా మోసం అని ఫైర్ అయ్యారు.
రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందని, పోలవరం ఎత్తు తగ్గించి తీరని అన్యాయం చేసి.. రూ.15వేల కోట్లు అప్పు ఇచ్చి రాజధానిని ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. నిజంగా అమరావతి (Amaravathi)పై మోడీ కి చిత్తశుద్ధి ఉంటే 9 ఏళ్లు గాడిదలు కాశారా?, రాజధాని పనులపై ఒక్కనాడైనా బాధ్యతగా అడిగారా?, ఒక్క రూపాయి నిధులైనా అమరావతికి కేటాయించారా?, 3d గ్రాఫిక్స్ అమలు సంగతేంటని చంద్రబాబును ప్రశ్నించారా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. అంతేగాక గత వైసీపీ ప్రభుత్వం (YCP Government) మూడు రాజధానుల (Three Capitals) పేరుతో మూడు ముక్కలాట ఆడుతుంటే వేడుక చూసింది మీరు కాదా? అని, ఇది తప్పని మీ దత్తపుత్రుడిని ఎందుకు వారించలేదు? అని నిలదీశారు.
అమరావతి రైతుల ఉద్యమం (Amaravathi Farmers Movement) ఢీల్లీ (Delhi) దాకా పాకితే కనీసం స్పందించలేదు ఎందుకు? అని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తామని ఇచ్చిన హామీ మరిచిపోయారా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేసి ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారో మోడీ సమాధానం చెప్పాలన్నారు. పదేళ్లు దాటినా రాష్ట్రానికి రాజధాని లేదంటే.. ఇందుకు ప్రధాన ముద్దాయి A1 మోడీ. A2 చంద్రబాబు (Chandrababu). A3 జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అని హాట్ కామెంట్స్ చేశారు.
ఇక వచ్చే నెల 2న అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని మోడీని ఏపీ కాంగ్రెస్ పార్టీ (AP Congress Party) పక్షాన డిమాండ్ చేస్తున్నామని, ఏపీ నూతన రాజధాని నిర్మాణం విభజన హామీలో ఒకటి అని, కేంద్రమే పూర్తి నిధులతో నిర్మించాల్సిన ప్రాజెక్ట్ అని, ఆంధ్రుల రాజధాని అమరావతికి పూర్తి స్థాయి నిధులు ప్రకటన చేయాలని అన్నారు. 10 ఏళ్లు ప్రత్యేక హోదా (Special Status) ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, వైజాగ్ స్టీల్ ప్లాంటు (Vizag Steel Plant) SAILలో విలీనంతో పాటు, కడప స్టీల్, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు లాంటి పెండింగ్ విభజన హామీలపై మీ వైఖరి తేల్చాలని, పోలవరం ఎత్తు 45 మీటర్లా? లేక 41 మీటర్లకే పరిమితమా? మోడీ క్లారిటీ ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ కోరారు.






