రూటు మారుస్తున్న పెద్దపులి.. బెంబేలెత్తున్నపరిసర ప్రజలు

by Vemula.Srinu Prasad |

పోలవరం మండలంలో పెద్ద పులి సంచారం గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మంటూరు తదితర ప్రాంతాల్లో వారం రోజులుగా తిరిగిన పెద్ద పులి గోదావరి దాటి, గుంజవరం, వెంకటరెడ్డి గూడెం గ్రామ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా సంచరించింది...

రూటు మారుస్తున్న పెద్దపులి.. బెంబేలెత్తున్నపరిసర ప్రజలు
X

దిశ , ఏలూరు/పోలవరం: పోలవరం మండలంలో పెద్ద పులి సంచారం గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మంటూరు తదితర ప్రాంతాల్లో వారం రోజులుగా తిరిగిన పెద్ద పులి గోదావరి దాటి, గుంజవరం, వెంకటరెడ్డి గూడెం గ్రామ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా సంచరించింది. పులి తిరుగుతున్న రూట్లో ఎదురుపడిన గిత్త దూడను చంపితింది. ఇప్పడు పులి రూట్‌ మార్చుకుని ఏజన్సీ గ్రామాలైన ఇటుకల కోట, మెత్తప్ప కోట గ్రామాల కొండల్లో సంచరిస్తోంది. దీంతో పెద్ద పులి కదలికలపై అటవీ శాఖ అధికారులు నిరంతరం నిఘా పెట్టారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లకూడదని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఎస్. కె. వల్లి తెలిపారు. పులిని ట్రాక్‌ చేస్తున్నామని, కదలికలను ఎప్పటికప్పుడు మోనిటర్‌ చేస్తున్నామని పేర్కొన్నారు.

Next Story