అధికారంలోకి టీడీపీ..వారిని మిస్ అవుతున్నామంటూ ఆ పార్టీ శ్రేణుల పోస్ట్ వైరల్!

by Jakkula.Mamatha |   (  Updated:2024-06-07 15:57:11  IST  )

2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ గడ్డపై తెలుగు దేశం పార్టీ తిరిగి అధికారంలోకి రానుండటంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

అధికారంలోకి టీడీపీ..వారిని మిస్ అవుతున్నామంటూ ఆ పార్టీ శ్రేణుల పోస్ట్ వైరల్!
X

దిశ,వెబ్‌డెస్క్: 2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ గడ్డపై తెలుగు దేశం పార్టీ తిరిగి అధికారంలోకి రానుండటంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే, ఈ సంతోష సమయంలో సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలతో పాటు తారకరత్నను మిస్ అవుతున్నామని ట్వీట్స్ చేస్తున్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలోకి రావాలని ఆయన కోరుకునేవారని తెలిపారు.

Next Story