నేను పోలీస్ నీకు దిక్కున్న చోట చెప్పుకో..ఖాకీ ముసుగులో కర్కషంగా మారిన భర్త

by samatah |

నన్ను పెళ్లి చేసుకుని ఒక కొడుకుకు జన్మనిచ్చాడు. ఎనిమిదేళ్లపాటు సజావుగా సాగిన సంసారంలో మరోమహిళ చిచ్చు పెట్టింది. తన భర్త ఆమె మోజులోపడి తమను నిర్లక్ష్యం చేస్తున్నాడు.

నేను పోలీస్ నీకు దిక్కున్న చోట చెప్పుకో..ఖాకీ ముసుగులో కర్కషంగా మారిన భర్త
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘నన్ను పెళ్లి చేసుకుని ఒక కొడుకుకు జన్మనిచ్చాడు. ఎనిమిదేళ్లపాటు సజావుగా సాగిన సంసారంలో మరోమహిళ చిచ్చు పెట్టింది. తన భర్త ఆమె మోజులోపడి తమను నిర్లక్ష్యం చేస్తున్నాడు. తమతో ఉండాలని ప్రాధేయపడుతుంటే చిత్రహింసలు పెడుతున్నాడు. నేను పోలీస్ నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ పొగరుతో లాఠీ తీసుకుని కొడుతున్నాడు. అవసరమైతే అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతోనే సర్ధుకుపోవాలని ఆదేశిస్తున్నాడు’ అని ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. ఈ షాకింగ్ ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పరాయిస్త్రీ మోజులో పడి తన భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నాడని బాధిత మహిళ విలపించింది. అక్రమ సంబంధం మానుకోవాలని కోరుతుంటే చిత్రహింసలు పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఖాకీ ముసుగులో కర్కషంగా మారి లాటీతో చితకబాదుతున్నాడని విలపించింది.కావాలంటే అక్రమ సంభంధం పెట్టుకున్న అమ్మాయితోనే ఉండాలని తనకు భర్త హుకుం జారీ చేస్తున్నాడని వాపోయింది. ఈ ఘటనపై దిశాలో కేసు నమోదు చేసిన న్యాయం జరగలేదంటూ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. నూతన అన్నమయ్య జిల్లా ఏర్పడినప్పటినుండి రెండు సార్లు ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో నూతన ఎస్పీ గంగాధర్ రావు కి మరో మారు ఫిర్యాదు చేసింది. మనసు చంపుకొని మరో ఆడదాని దగ్గర బ్రతకలేనని.. 7 సవత్సరాల కొడుకుని గాలికి వదిలి చావలెనని ఆమె విలపిస్తోంది. ఎక్కడకెల్లాలో ఏమి చేయాలో అర్థం కావడం లేదంటూ తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ మీడియా ముందు బాధిత మహిళ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

Next Story