అన్నదమ్ముల దారుణ హత్య.. 13 మంది అరెస్ట్

by Vemula.Srinu Prasad |

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతిలో జరిగిన ప్రతీకార హత్య కేసును పోలీసులు ఛేదించారు..

అన్నదమ్ముల దారుణ హత్య.. 13 మంది అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం(Yemmiganur Mandalam) కందనాతి(Kandanathi)లో ఈ నెల 5న అన్నదమ్ములు పరమేశ్, దుర్గేశ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు సంవత్సరాల క్రితం రవి, నరసింహులు అనే వ్యక్తుల హత్య జరిగింది. ఇందుకు ప్రతీకారంగా అన్నదమ్ములను నరికి చంపినట్లు తేలింది. పోలీసులు విచారణ చేపట్టి నిందితులను బనసవాసి ఫారం సెంట్రల్ నర్సరీ వద్ద అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి వేటకొడవళ్లు, గొడ్డలితో పాటు నాలుగు పట్టుడు కట్టెలు స్వాధీనం చేసుకున్నారు. మీడియా ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు.

Next Story