Breaking: ఏపీ రాజధాని అమరావతిలో హై అలెర్ట్.. ఎస్పీ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

ఏపీ రాజధాని అమరావతిలో పోలీసులు హై అలెర్ట్ జారీ చేశారు...

Breaking: ఏపీ రాజధాని అమరావతిలో హై అలెర్ట్.. ఎస్పీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati)లో పోలీసులు హై అలెర్ట్(High Allert) జారీ చేశారు. ఇటీవల రాజధానిలో జరుగుతున్న ఘటనలు, అలాగే అమరావతి చట్టత నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందాల్(SP Vakul Jindal) కీలక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో విద్రోహక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు అమరావతిలో 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి సమయంలో డ్రోన్లతో నిఘా పెట్టినట్లు ప్రకటించారు. అలాగే ప్రతినిత్యం పోలీస్ పెట్రోలింగ్ ఉంటుందని తెలిపారు. ఇక నిర్మాణ సంస్థలు కెమెరాలతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని పెట్టుకోవాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు.

Next Story