మాచర్ల అత్యాచారం ఘటన.. సీసీటీవీ దృశ్యాల్లో కీలక ఆధారాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-03 13:18:16  IST  )

పల్నాడు జిల్లా మాచర్లను వణికించిన అత్యాచార ఘటనలో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు..

మాచర్ల అత్యాచారం ఘటన.. సీసీటీవీ దృశ్యాల్లో కీలక ఆధారాలు
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా మాచర్ల(Macharla)ను వణికించిన అత్యాచార ఘటనలో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంత్రాంగం.. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఘటనాస్థలం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు, అందులో ఒక అనుమానితుడిని గుర్తించినట్లు సమాచారం. ఈ ఆధారాలతో నిందితుడికి పోలీసులు చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది.

రంగంలోకి క్లూస్ టీమ్..

మరోవైపు క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఘటనాస్థలంలో కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. నిందితుడి ఆచూకీ కనిపెట్టి త్వరితగతిన అరెస్టు చేసేందుకు పలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. బాధితురాలికి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తూ, ఎక్కడా లొసుగులు లేకుండా విచారణను వేగవంతం చేశారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

ఒంటరి మహిళపై పాశవికం

కాగా సత్తెనపల్లి చెందిన మహిళ ఉద్యోగరీత్యా మాచర్లలో నివాసముంటున్నారు. అయితే ఒంటరిగా ఉంటున్న ఆమె గుడ్ ఫ్రైడే సందర్భంగా సత్తెనపల్లికి వెళ్లే ప్రయత్నం ఉన్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి ఇంటి వద్దకు బయట ఎండ తీవ్రత చాలా ఉందని, కొంచెం మంచినీళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆమె ఇంట్లోకి వెళ్లిన వెంటనే దుండగుడూ చొరబడ్డారు. కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఆమె నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు, చేతులు కట్టేసి అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఈ ఘటన మాచర్ల వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Next Story