ఆటోలో 'సీక్రెట్' అర.. తనిఖీ చేస్తే రూ.20 లక్షల గంజాయి

by Vemula.Srinu Prasad |

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చిన్నయ్యపాలెం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా వచ్చిన ఆటోను సోదాలు చేశారు. ..

ఆటోలో సీక్రెట్ అర.. తనిఖీ చేస్తే రూ.20 లక్షల గంజాయి
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli District) గొలుగొండ మండలం చిన్నయ్యపాలెం(Chinnayapalem) వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా వచ్చిన ఆటోను సోదాలు చేశారు. అయితే భారీగా గంజాయి పట్టుబడింది. మార్కెట్‌లో దాదాపు రూ. 20 లక్షల విలువ చేసే 32 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎవరికీ అనుమానం రాకుండా..

అయితే నిందితులు పోలీసుల కళ్లు కప్పేందుకు ఆటోలో ఎవరికీ అనుమానం రాకుండా ఒక ప్రత్యేకమైన రహస్య అరను ఏర్పాటు చేశారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (AOB) ప్రాంతంలో ఈ గంజాయిని కొనుగోలు చేసి, అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా తుని వైపు తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు ప్రస్తుతం విచారణను ముమ్మరం చేశారు.

Next Story