- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మాయమాటలతో నమ్మించి అత్యాచారం.. ఆపై నగ్నంగా ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్

దిశ, వెబ్ డెస్క్: మాయ మాటలతో నమ్మించి ఇంజినీరింగ్ విద్యార్థినిని అత్యాచారం చేసిన దుర్మార్గుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల(Paritala)లో జరిగింది. పరిటాల గ్రామానికి చెందిన హుస్సేన్ (Gali Saida)కు.. అదే గ్రామం హాస్టల్‌లో ఉంటున్న బీటెక్ విద్యార్థిని(B Tech Student) పరిచయం అయ్యింది. కంచికచర్ల(Kanchikacharla)లో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినికి వద్దకు హుస్సేన్ ప్రతి రోజూ వెళ్తూ మరింత పరిచయాన్ని పెంచుకున్నారు.
అలాగే పరిటాల గ్రామంలోనే హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినితో హుస్సేన్ క్లోజ్‌గా మూవ్ అయ్యాడు. అయితే స్నేహాన్ని ఆసరాగా చేసుకుని విద్యార్థినికి మాయ మాటలు చెప్పడం ప్రారంభించాడు. సైదా చెప్పేవి మాయ మాటలని తెలియక ఓ రోజు విద్యార్థిని అతని వెంట వెళ్లింది. దీంతో ఆమెపై అత్యాచారం చేశాడు. విద్యార్థిని నగ్నంగా ఉన్న ఫొటోలను తీశాడు. అనంతరం బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాదు ఆ ఫొటోలను తన స్నేహితులకు షేర్ చేశారు. దీంతో వాళ్లు కూడా బెదిరింపులకు దిగారు.
ఇలా ప్రతి నిత్యం విద్యార్థినిని వేధింపులకు గురి చేశారు. ఈ మధ్య కాలంలో వీరి బెదిరింపు ఎక్కువ కావడంతో భరించలేకపోయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. హుస్సేన్, అతని స్నేహితులపై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బృందాలుగా గాలించి నిందితులు షేక్ హుస్సేన్, సిద్ధు, చింతల ప్రభు దాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.