- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహనదారులకు ఊరట.. పెట్రోల్ బంకుల్లో సాధారణ స్థితి
రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఊరిస్తున్న పెట్రోల్, డీజిల్ కష్టాలకు తెరపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సరఫరా పుంజుకోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఊరిస్తున్న పెట్రోల్(Petrol), డీజిల్(Deisel) కష్టాలకు తెరపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సరఫరా పుంజుకోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మొత్తం 4,345 పెట్రోల్ బంకుల్లో కేవలం 47 బంకులు మినహా, మిగిలిన అన్ని చోట్లా నిల్వలు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. చమురు సంస్థల నుంచి బంకులకు సుమారు 3,714 కిలో లీటర్ల పెట్రోల్, 7,107 కిలోలీటర్ల డీజిల్‌ను అధికారులు విజయవంతంగా చేరవేశారు. దీంతో మెజారిటీ ప్రాంతాల్లో 'నో స్టాక్' బోర్డులు మాయమై, రవాణా వ్యవస్థ తిరిగి గాడిలో పడింది.
ఇంకా కొన్నిచోట్ల...
అయితే పశ్చిమగోదావరి, కడప, తిరుపతి జిల్లాల్లో మాత్రం ఇంకా కొన్నిచోట్ల కొరత కొనసాగుతోంది. ఈ మూడు జిల్లాల్లో పదికిపైగా బంకుల్లో స్టాక్ అందుబాటులో లేకపోవడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మూతపడిన ఆయా బంకులకు యుద్ధప్రాతిపదికన ఇంధనాన్ని తరలించేందుకు రవాణా చర్యలు చేపట్టారు. ఒకటి రెండు రోజుల్లో ఈ జిల్లాల్లో కూడా పరిస్థితి పూర్తిగా చక్కబడుతుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.






