రాష్ట్రానికి భారీ గుడ్‌న్యూస్.. లక్షా 17 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ లభించింది...

రాష్ట్రానికి భారీ గుడ్‌న్యూస్.. లక్షా 17 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్(Good News) లభించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా పెట్టుబడులు(Investments) పెట్టేందుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీంతో విశాఖ(Visakha)లో రూ. 4800 కోట్లతో రైడన్ ఇన్ఫోటెక్ సంస్థ(Raidon Infotech Company) ఏర్పాటు కాబోతుంది. ఇందుకు ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపింది. ఈ సంస్థ ఇన్ఫోటెక్ గూగుల్(Infotech Google) అనుబంధ సంస్థ. దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ కూడా ఇదే కావడం విశేషం. ఈ విషయాన్ని మంత్రి పార్థసారథి(Minister Parthasarathy) తెలిపారు. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కొత్త వలసలో మైరా రిసార్ట్స్ హోటల్ నిర్మించబోతున్నామని, ఇందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందని తెలిపారు. అమరావతి(Amaravati)లో సదరన్ గ్రూప్ హోటల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. రూ. 200 కోట్లతో దసపల్లా 4 స్టార్ హోటల్‌ను అమరావతి(Amaravati)లో నిర్మించేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు. అలాగే పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణాలకు ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థ సారథి పేర్కొన్నారు.

మరోవైపు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రూ. 5 వేల కోట్లతో రిలయన్స్ ఎఫ్ఎమ్సీజీ పెట్టుబడులు పెడుతుందని మంత్రి స్పష్టం చేశారు. విజయనగరంలో చింతా గ్రీన్ ఎనర్జీ పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ కంపెనీ రూ. 12,905 కోట్లు పెట్టుబడి పెడుతోందని, తద్వారా 3 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. అలాగే అనంతపురంలో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా SIPB ఆమోదించిన రూ. లక్షా 17 వేల కోట్ల పెట్టుబడులకు సైతం కేబినెట్ ఆమోదముద్ర వేసిందని తెలిపారు. ఆర్టీసీ బస్సులన్నింటినీ ఎలక్ట్రిక్‌‌గా మార్చే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి పార్థ సారథి పేర్కొన్నారు.

Next Story