పోలీసులు విచారిస్తుండగా కుప్పకూలిన ఆ పార్టీ నేత.. చివరికి?

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-04 07:59:17  IST  )

రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు విచారిస్తుండగా కుప్పకూలిన ఆ పార్టీ నేత.. చివరికి?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు లో పోలీసులు విచారిస్తుండగా టీడీపీ నేత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెలితే.. ‘మైనింగ్ వద్దు గ్రామమే ముద్దంటూ’ గ్రామస్తులు తెలిపిన నిరసనలో టీడీపీ నేత షేక్ పీరయ్య పాల్గొన్నారు. దీంతో అతడిని విచారణకు పిలిపించారు.

ఈ క్రమంలో షేక్ పీరయ్య గుండెపోటుకు గురయ్యారు. పోలీసులు విచారిస్తుండగా అతనికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన పోలీసులు వెంటనే అతడిని ప్రకాశం జిల్లా పామూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పీరయ్య బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీంతో పోలీసులు వేధింపుల వల్లే ఆయనకు గుండెపోటు వచ్చిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వరికుంటపాడు పోలీస్ స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. పీరయ్యను బలవంతంగా స్టేషన్‌కు తీసుకొచ్చి బెదిరించారని ఆరోపించారు.

Next Story