- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు.. ఈసారి అక్కడే..?
మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలపై ఆ పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది...

దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ(Janasena) ఆవిర్భావ వేడుకలపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. మార్చి 14న గ్రాండ్‌గా నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ నాయకులు కసరత్తులు ప్రారంభించారు. ఈసారి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Janasena Chief Pawan Kalyan) నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ తరపున ప్రకటన విడుదల చేశారు. అదే రోజు పిఠాపురం(Pithapuram)లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఇప్పటి నుంచే ఆ కార్యక్రమం పనులపై ఫోకస్ పెట్టారు.
కాగా 2014 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ మాదాపూర్ నోవాటెల్(Hyderabad Madapur Novatel) భవనంలో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ(Congress)కి వ్యతిరేకంగా జనసేన పార్టీ పుట్టిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్టీ స్థాపించి 11 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈసారి కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. జనసేన పార్టీ తరపున ఆయన పిఠాపురంలో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు pic.twitter.com/oXdT4MAQq7
— JanaSena Party (@JanaSenaParty) February 17, 2025






