- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకులకు లాఠీ పాఠం.. వీడియో వైరల్
రాష్ట్రంలో పోలీసుల బహిరంగ థర్డ్ డిగ్రీ సంచలనంగా మారింది....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పోలీసుల బహిరంగ థర్డ్ డిగ్రీ(Third Degree) సంచలనంగా మారింది. నడిరోడ్డుపై ముగ్గురు యువకుల(Youth)కు లాఠీ పాఠం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గుంటూరు జిల్లా(Guntur) తెనాలి ఐతానగర్(Aithanagar)కు చెందిన యువకులు గంజాయి(Ganja) మత్తులో పోలీస్‌పై దాడి చేశారు. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను బహిరంగంగా శిక్షించారు. చేతుల కట్టసి నేలపై కూర్చోపెట్టి కాళ్లపై లాఠీతో కొడుతూ బుద్ధి చెప్పారు. వదిలేయమని కోరినా కనికరించకుండా విచక్షణారహితంగా కొట్టారు. అయితే ఈ వీడియో చూసిన కొందరు బాగా బుద్ధి చెప్పారనే కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే పోలీసుల తీరుపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఏది ఏమైనా నిందితులను కొట్టకూడదనే నిబంధన అయితే ఉంది. మరి ఈ విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు ఏం చేస్తారో చూడాలి.
లాఠీ పాఠం..? pic.twitter.com/ctg8rqNv58
— vemula srinuprasad ( Chief SubEditor) DISHA DAILY (@srinuprasad1234) May 27, 2025






